టాలీవుడ్ నటుడు మంచు విష్ణు హీరోగా తాజాగా తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ విజువల్ ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో పాటు పలు ఇతర భాషల నటీనటులు క్యామియో పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తుండగా కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ సినిమాస్ సంస్థలపై మంచు విష్ణు గ్రాండ్ గా భారీ స్థాయిలో హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. వాస్తవానికి కన్నప్ప సినిమాని ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలని భావించారు.
అయితే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు సినిమాకు సంబంధించి మరికొన్ని పనులు పెండింగ్ ఉండటంతో దీనిని మరొక రెండు నెలలు వాయిదా వేసి జూన్ 27 గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్టు తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన కన్నప్ప మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.