మంచు విష్ణు హీరోగా 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన పాన్ ఇండియన్ మైథాలజికల్ డివోషనల్ ఎంటర్టైనర్ సినిమా కన్నప్ప. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 27 గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చింది.
అయితే మొదటి రోజు నుంచి ఒకింత మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్న కన్నప్ప మూవీ రాను రాను బాక్సాఫీస్ వద్ద దారుణంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఏరియాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయ్యిందని చెప్పాలి.
ఓవరాల్ గా ఈ సినిమా రూ. 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందింది. ఇది ఒకింత సక్సెస్ఫుల్ సినిమాగా నిలవాలి అంటే గ్రాస్ పరంగా రూ. 100 కోట్ల అయినా రాబట్టాల్సి ఉంది.
మరోవైపు సినిమాకి అక్కడక్కడ పరవాలేదనే కలెక్షన్ వస్తున్నప్పటికీ మొత్తంగా చూస్తే ఇది చాలా తక్కువ కలెక్షన్ అని, మరి ఫైనల్ గా కన్నప్ప ఎంతమేర విజయవందుకొని ఫైనల్ గా ఎక్కడ ఆగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది.