Homeసినిమా వార్తలుKannappa First Song got Good Response '​కన్నప్ప' ఫస్ట్ సాంగ్ కి గుడ్ రెస్పాన్స్ 

Kannappa First Song got Good Response ‘​కన్నప్ప’ ఫస్ట్ సాంగ్ కి గుడ్ రెస్పాన్స్ 

- Advertisement -

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. ఈ మూవీలో శరత్ కుమార్, మోహన్ లాల్, ముకేశ్ ఋషి, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. 

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇటీవల కన్నప్ప నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పాత్రధారుల యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక నిన్న ఈ మూవీ నుండి శివ శివ శంకర అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్ ని విజయ్ ప్రకాష్ అద్భుతంగా ఆలపించారు. 

ఆకట్టుకునే లిరిక్స్ తో పాటు ట్యూన్ తో ఈ సాంగ్ ప్రస్తుతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ 6 మిలియన్ కి పైగా వ్యూస్ తో కొనసాగుతోంది. త్వరలో మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం కన్నప్ప ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

READ  Retro First Song Release Date Fix '​రెట్రో' ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories