టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా కొరటాల శివ తెరకేకించిన మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
అయితే ఇప్పటికే ఓవైపు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి యాక్షన్ ఎంటర్టైనర్ వార్ 2 మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆగష్టు లో ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, దీని అనంతరం అతి త్వరలో ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తన కెరీర్ 31వ మూవీని ఎన్టీఆర్ చేయనున్న విషయం తెలిసిందే.
మరొక నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో కన్నడ యంగ్ అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్. ఇప్పటికే ఆమెని మూవీ టీమ్ సంప్రదించినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై NTR 31 టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది.