Home సినిమా వార్తలు Kanguva USA Advances Disappoints నిరాశాజనకంగా ‘కంగువ’ యుఎస్ఏ బుకింగ్స్

Kanguva USA Advances Disappoints నిరాశాజనకంగా ‘కంగువ’ యుఎస్ఏ బుకింగ్స్

kanguva movie

కోలీవుడ్ స్టార్ నటుడు మరియు వెర్సల్ యాక్టర్ అయిన సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో దిశాపటాని హీరోయిన్ గా తెరకక్కుతున్న తాజా సినిమా కంగువ. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ నవంబర్ 14న గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీపై అటు తమిళ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

ఇటీవల కంగువ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ తో పాటు సాంగ్స్, టీజర్ అన్ని కూడా అందరిని ఆకట్టుకుని సినిమా పై మరింతగా అంచనాలు పెంచేసాయి. నేడు ఈ మూవీ యొక్క రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక నవంబర్ 14న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో కంగువ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. విషయం ఏమిటంటే తాజాగా కంగువ యొక్క యూఎస్ఏ బుకింగ్స్ ఓపెన్ చేయగా అవి ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ఇప్పటివరకు కేవలం 65కె మాత్రమే ప్రీ బుకింగ్స్ జరిగాయి.

ఒకరకంగా ఇవి సూర్య స్థాయి బుకింగ్స్ కాదని చెప్పాలి. నిజానికి ఈ సినిమాపై మంచి హైప్ ఉన్నప్పటికీ ఓవర్సీస్ మార్కెట్లో ఎందుకని తక్కువ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. తప్పకుండా ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ తరువాత అంచనాలు పెరిగి, ఆపై మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని సూర్య ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో దీన్ని నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version