Home సినిమా వార్తలు Kanguva Trailer Release Date ‘కంగువ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Kanguva Trailer Release Date ‘కంగువ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

kanguva

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా బాలీవుడ్ అందాల కథానాయిక దిశా పటాని హీరోయిన్ గా యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థల పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. దీనిని సిరుత్తై శివ తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అందరిలో మొదటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ పాన్ ఇండియన్ మూవీ అక్టోబర్ 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కంగువ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయి. అయితే మ్యాటర్ ఏమిటంటే, కంగువ ట్రైలర్ ని ఆగష్టు 12న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు.

బాబీ డియోల్, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ,ఆనందరాజ్ తదితరులు ఈ మూవీలో ఇతర పాత్రలు చేస్తున్నారు. సూర్య ఒక పవర్ఫుల్ పాత్ర చేస్తున్న ఈమూవీకి వెట్రి పళనిస్వామి ఫొటోగ్రఫి అందిస్తున్నారు. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన కంగువ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version