కోలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ యాక్షన్ ఫాంటసీ మూవీ కంగువ. అత్యంత ప్రతిష్టాత్మకంగా యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా అనిమల్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారు.
ఇటీవల ఈ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య ఈ ట్రైలర్ లో పవర్ఫుల్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఆయన తమ్ముడు కార్తీ ఈ మూవీ యొక్క క్లైమాక్స్ లో ఒక క్యామియో పాత్రలో కనిపించనున్నారట. అయితే విషయం ఏమిటంటే తాజాగా కంగువ మూవీ రన్ టైం లాక్ అయింది.
నవంబర్ 14న గ్రాండ్ గా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న కంగువ మూవీ 2 గం. 26 ని. ల నిడివిని కలిగి ఉంది. మొత్తంగా అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన కంగువ పై ఇటు తెలుగు ఆడియన్స్ లో కూడా బాగా క్రేజ్ ఉంది. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.