కోలీవుడ్ స్టార్ నటుడు వెర్సటైల్ యాక్టర్ సూర్య హీరోగా దిశాపటాని హీరోయిన్ గా తెరకెక్కిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. గ్రాండ్ లెవెల్లో శివ తెరకెక్కించిన ఈ సినిమాని స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. అయితే ఇటీవల ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి అందరిని నిరాశపరిచి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
ఓవరాల్ గా తమ మూవీ రూ. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేయగా రిలీజ్ అనంతరం ఓవరాల్ గా రూ. 100 కోట్లు మాత్రమే కలెక్షన్ అందుకుంది. నిజానికి ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ 45 నుంచి 60 రోజులు మధ్యన ఓటిటి ఆడియన్స్ ముందుకు తీసుకురావాల్సింది.
కానీ ప్రస్తుతం డిజాస్టర్ టాక్ తో పూర్తిగా నష్టాలు మిగిల్చిన ఈ మూవీని డిసెంబర్ 8న అమెజాన్ ప్రైమ్ వీడియో తమ ఓటిటి ఆడియన్స్ ముందుకు తీసుకురానుంది. మొత్తంగా అయితే ఈ మూవీ ద్వారా నటుడిగా సూర్య ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇటీవల కాలంలో కోలీవుడ్ లో ఇంత పెద్ద డిజాస్టర్ ఇటీవల కాలంలో రాలేదు.