కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సిరుత్తై శివ తెరకెక్కిస్తుండగా యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థల పై కె. ఇ. జ్ఞానవేల్ రాజా, వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, అబ్దుల్లా అల్ సాజిద్ గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన కంగువ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అలానే థియేట్రికల్ ట్రైలర్ కి కూడా బాగానే రెస్పాన్స్ లభించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ మూవీలో సూర్య పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా వెట్రి పళనిస్వామి ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా తాజాగా లేటెస్ట్ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. అన్ని కార్యక్రమాలు ముగించి కంగువ మూవీని నవంబర్ 14న భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మరి కంగువ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.