Homeసినిమా వార్తలుKanguva Movie Runtime Details 'కంగువ' రన్ టైం డీటెయిల్స్

Kanguva Movie Runtime Details ‘కంగువ’ రన్ టైం డీటెయిల్స్

- Advertisement -

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థల పై కె. ఇ. జ్ఞానవేల్ రాజా, వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి భారీ స్థాయిలో నిర్మిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నవంబర్ 14న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తాజాగా కంగువ రన్ టైం లాక్ అయింది. కాగా ఈ మూవీ 2 గం. 34 ని. ల పాటు సాగనుండగా దీనికి ఒక సెన్సార్ కట్ లేకుండా యు / ఏ సర్టిఫికెట్ కేటాయించారు సెన్సార్ బోర్డు వారు. ఇక ఈ మూవీకి సంబంధించి సెన్సార్ లో భాగంగా 11 సీన్స్ కి సంబంధించి కొద్దిపాటి చేంజెస్ ని సెన్సార్ టీమ్ చేసింది.

పలు డైలాగుల్లో మాటలు రీప్లేస్ చేయించడంతో పాటు యాక్షన్ సీన్స్ లో రక్తం, వయొలెన్స్ ఎక్కువగా కనపడకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తంగా అయితే తామందరం ఎంతో కష్టపడ్డ కంగువ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుని బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

READ  Pushpa 2 will be Boxoffice Sensation 'పుష్ప - 2' బాక్సాఫీస్ పెను సంచలనం ఖాయం : దేవిశ్రీప్రసాద్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories