తమిళ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా పలు సక్సెస్ఫుల్ సినిమాలని తమ స్టూడియో గ్రీన్ సంస్థ పై నిర్మిస్తూ ఆడియన్స్ నుండి మంచి ఆదరణ అందుకుంటున్న ప్రొడ్యూసర్ టీజె జ్ఞానవేల్ రాజా.
ప్రస్తుతం సిరుత్తై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కంగువ మూవీని యువి క్రియేషన్స్ తో కలిసి నిర్మిస్తున్నారు జ్ఞానవేల్ రాజా. ఆ సందర్భంగా తాజాగా ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా పై అలానే ఇక్కడి ఆడియన్స్ పై ప్రసంశలు కురిపిస్తూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు.
నిజానికి తమిళ ఆడియన్స్ ఇతర హీరోలని తమవారుగా భావించరని, కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఇక్కడి హీరోలని తమ సొంతవారుగా భావించి ఆదరిస్తుండడం ఎంతో ఆనందంగా అనిపిస్తుందని తెలిపారు. ఇక దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇండియన్ సినిమాని ఎల్లలు దాటించి గొప్ప క్రేజ్, మార్కెట్ తీసుకువచ్చారని అన్నారు. కాగా సూర్యతో ఆయన నిర్మిస్తున్న కంగువ మూవీ అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకి రానుంది.