కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సూర్య డ్యూయల్ రోల్ చేసిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. శివ తెరకెక్కించిన ఈ మూవీని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అయితే ప్రారంభం నాటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఊహించని స్థాయిలో భారీ నష్టాలని చవిచూసిన ఈ మూవీ పై అన్ని భాషల ఆడియన్స్ నుండి విపరీతమైన విమర్శలు వెల్లువెత్తాయి. భారీ ఖర్చు అయితే ఉందని, కానీ ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడంతో మూవీ మూవీ ప్లాప్ అయిందని చెప్పవచ్చు. ఇక థియేటర్స్ లో ఏమాత్రం ఆకట్టుకోని ఈ మూవీ అటు తాజాగా ఓటిటి లో రిలీజ్ అయి కూడా ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క నిడివి ఒరిజోనల్ థియేటర్ వర్షన్ తో పోలిస్తే 12 నిముషాలు తగ్గి మొత్తంగా 141 నిమిషాల నిడివితో ఓటిటిలోకి వచ్చింది. ఇక ఓటిటి ఆడియన్స్ కూడా ఈ మూవీ చూడడం పై నిరాసక్తత కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆడియన్స్ ఈ మూవీ ఓటిటి వర్షన్ పై నెగటివిటీ అందుకుంటోంది.