కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా శివ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ కంగువ. ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుండగా స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అక్టోబర్ 10న భారీ ఎత్తున పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
ఇక నేడు సూర్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుండి ఫైర్ సాంగ్ రిలీజ్ చేసారు మేకర్స్. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ అద్బుతంగా ఆలపించిన ఈ సాంగ్ ని శ్రీమణి రచించారు. ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల, వీర జ్వాల, దైవ జ్వాల, దావాగ్ని జ్వాల అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ముఖ్యంగా యుద్ధవీరుడిగా సూర్య మేకోవర్, అలానే విజువల్స్ తో పాటు ప్రేమ్ రక్షిత్ అందించిన స్టెప్స్ ఈ పవర్ఫుల్ సాంగ్ అందరినీ ఆకట్టుకునేలా చేసాయి. ప్రస్తుతం ఫైర్ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. మరి రిలీజ్ అనంతరం కంగువ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.