కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
అయితే ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. తమిళనాడులో పర్వాలేదనిపించిన ఈ మూవీ దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా ఏమాత్రం ఆకట్టుకునే స్థాయిలో కలెక్షన్ అందుకోలేదు. చాలా ఏరియాల్లో ఈమూవీకి నష్టాలు తప్పేలా లేవు. అయితే విషయం ఏమిటంటే, హింది మూవీస్ మాదిరిగా ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ 8 వారాల అనంతరం ఓటిటి ఆడియన్స్ ముందుకి రావాల్సి ఉంది.
అయితే తాజా కోలీవుడ్ న్యూస్ ప్రకారం మూవీ ఫ్లాప్ కావడంతో సౌత్ మూవీస్ మాదిరే కేవలం 4 వారాల్లోనే ఇది ఓటిటి లో రిలీజ్ కానున్నట్లు చెప్తున్నారు. ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వారు ఈ మూవీని భారీ ధరకు కొనుగోలు చేసారు. సూర్య తమ్ముడు కార్తీ ఒక కీలకపాత్రలో నటించిన ఈ మూవీలో సూర్య రెండు పాత్రల్లో కనిపించారు. మరి పక్కాగా కంగువ మూవీ ఓటిటి రిలీజ్ కి సంబంధించి క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అని తెలుస్తోంది.