లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో భారీ హిట్ సాధించారు. చాలా రోజుల తర్వాత కమల్ కి బిగ్గెస్ట్ హిట్ “విక్రమ్”. ఈ చిత్ర విజయంతో కమల్ ఆనందానికి అవధులు లేవు.ఇప్పటికే విక్రమ్ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని వసూలు చేయడంతో ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించిన కమల్ కి డబ్బులు బాగానే వచ్చాయి. దీంతో కమల్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆనందాన్ని చిత్త బృందానికి గిఫ్ట్స్,పార్టీ ఇచ్చి సంబరాలు జరుపుకున్నారు.
లోకేష్ కనగరాజ్ కేవలం రెండు మూడు సినిమాలతోటే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. గన్స్, డ్రగ్స్,మాఫియా గ్యాంగ్,పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్ అంటూ ఒక ప్రపంచంలోకి ప్రేకక్షులని తీసుకు వెళ్ళడం ఆయనకే చెల్లింది. పైగా ఆయన సినిమాలలో కథ ఎక్కువ సేపు కాకుండా కేవలం ఒక రోజు లేదా కొన్ని రోజుల గడువులోపు ఉంటుంది. దాని వల్ల తరువాత ఏం జరగబోతుందో అనే అంశాన్ని ఉత్కంఠభరితంగా చెప్పే వీలు ఉంటుంది.విక్రమ్ లో కమల్ ను ఒక అభిమానిగా తను ఎలా చూడాలి అనుకున్నాడో అలా చూపిస్తూ ప్రేక్షకులను అబ్బురపోయేలా చేసిన లోకేష్ ఆయనతో పాటు ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి పాత్రలను కూడా అంతే ఆసక్తికరంగా చూపించడం వల్లే సినిమా ఇంతటి ఘనవిజయం సాధించింది.కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ కి తోడు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విక్రమ్ కు ఎంతో ఉపయోగపడింది.
ఇక ధియేటర్ లలో ప్రేక్షకులను అలరించిన విక్రమ్ తొందరలోనే ఓటిటి లో విడుదల కానుందని సమాచారం. జూలై 8 నుంచి విక్రమ్ అన్ని భాషల్లోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతుంది అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరి థియేటర్లలో సూపర్ హిట్ అయినట్టే విక్రమ్ ఓటిటిలో కూడా ఆదరణ పొందుతుంది అని ఆశిద్దాం.