ZEE5, భారతదేశంలోని అతిపెద్ద వీడియో ఆన్ డిమాండ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ లలో ఒకటి. దేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమల నుంచి అన్ని రకాల సినిమాలు, వెబ్ సీరీస్ లను వీక్షకులకు అందజేస్తూ చాలా త్వరగా ఓటిటి సంస్థలలో అగ్రస్థానానికి ఎగబాకుతుంది. తాజాగా తన లైబ్రరీలో మరో అద్భుతమైన సినిమాని చేర్చుకుంది.
ప్రేక్షకులు ఎంతగానో విశేష స్థాయిలో ఆదరించి.. అటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ యొక్క వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌ను ఇటీవలే ప్రకటించింది. లోకేష్ కనగరాజ్ రచన మరియు దర్శకత్వం వహించిన విక్రమ్ చిత్రంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో ఈ చిత్రం విమర్శకులు మరియు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుని సూపర్ హిట్ చిత్రంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ఈ చిత్రం తమిళనాడులో అత్యధిక వసూళ్లు సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ చిత్రంగా కూడా నిలిచింది. కాగా నిన్నటి నుంచి అంటే 13 సెప్టెంబర్ 2022 నుండి హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో Zee5 ప్లాట్‌ఫారమ్ పై ప్రసారం అవుతుంది.
రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ చిత్రం అదే పేరుతో 1986లో విడుదలైన చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కింది. కమల్ హసన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా డ్రగ్ మాఫియా, గ్యాంగ్ వార్స్ మరియు రోమాలు నిక్కబొడుచుకొనే అద్భుత పోరాట ఘట్టాలతో తెరకెక్కిన హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రం. ఈ చిత్రంలో వరుస హత్యల కేసును పరిష్కరించే పోలీస్ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటించారు. ఇక డ్రగ్ మాఫియా గ్యాంగ్ లోని ఒక ముఖ్య సభ్యుడిగా విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కనిపించారు. ఈ ముగ్గురు అసాధారణ నటుల మధ్య వచ్చే సన్నివేశాలు మరియు సంభాషణలు ప్రేక్షకులని విపరీతంగా అలరించాయి.
IMDB సైట్ లో 8.4 రేటింగ్‌తో, విక్రమ్ సినిమాలోని నటీనటుల నటనకు, అలాగే చిత్ర కథనానికి కూడా ప్రశంసలు దక్కాయి. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్ లతో పాటు థ్రిల్లింగ్ సీన్స్ వరకు ఈ చిత్రంలో మాస్ ప్రేక్షకులని అలరించే అంశాలు చాలా ఉన్నాయి.
కాగా ఇదివరకు Disney+Hotstar లో స్ట్రీమింగ్ కాబడిన విక్రమ్, తాజాగా ZEE5లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌తో, ఏకంగా 190 దేశాలలోని వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది.