సినిమా పరిశ్రమలో ఏదీ శాశ్వతం కాదు, చాలా మంది సినీ హీరోలు మరియు విశ్లేషకులు చెప్పినట్టు ఒక్క శుక్రవారమే పరిస్థితులని మార్చేస్తుంది. ప్రథమ స్థానంలో ఉన్న వారిని కింది స్థాయిలో.. అలాగే అట్టడుగున ఉన్న వారిని అందలానికి ఎగబాకేలా పట్టాలెక్కిస్తుంది. కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజినీకాంత్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ మధ్య ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే నెలకొంది.
ఈ లెజెండ్స్ ఎన్నో ఏళ్ల నుంచి సూపర్ స్టార్‌డమ్‌ను ఆస్వాదించినప్పటికీ.. 70ల నుండి 90ల మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. అప్పటి నుండి రజినీకాంత్ ఆయన చేసిన కమర్షియల్ సినిమాల కారణంగా ఆధిపత్యం చెలాయించారు. కమల్ హసన్ నిర్దిష్ట వర్గాల ప్రేక్షకులను మరియు వైవిధ్యం ఇష్టపడే ప్రేకకుల కోసమే ఎక్కువగా చిత్రాలను తెరకెక్కించారు.
ఇటీవల లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కమల్ నిర్మించటంతో పాటు నటించిన ఈ చిత్రం భారీ స్పందనను పొందింది. మరియు దక్షిణ భారతదేశం మరియు విదేశీ మార్కెట్లలో కూడా కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఆ క్రమంలో కమల్ తన స్నేహితుడు రజినీకాంత్‌ను అధిగమించడమే కాకుండా రజనీ కెరీర్ గూర్చి ప్రశ్నను తలెత్తేలా చేసింది.
రజినీకాంత్ ఇప్పటికీ చెప్పుకోదగ్గ బాక్సాఫీస్ స్టామినాను ఆస్వాదిస్తున్నప్పటికీ, ఆయన తాజాగా నటిస్తున్న సినిమాలు పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేదు. ఆయన గతంలో నటించిన రెండు చిత్రాలు ఓ మోస్తారుగా ఆడాయి. మరియు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో ఉత్తేజకరమైన ప్రభావం చూపేలా లేవు. ఇటీవలే బీస్ట్ రూపంలో విజయ్‌తో డిజాస్టర్ అందించిన నెల్సన్‌తో జైలర్ అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే తన కుమార్తె దర్శకత్వం వహించే లాల్ సలాం అనే చిత్రంలో కూడా అతిధి పాత్రలో నటించాల్సి ఉంది. డాన్ ఫేమ్ సిబి చక్రవర్తితో మరో సినిమా కూడా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించడం లేదు.
మరో వైపు, కమల్ తన ఆగిపోయిన ప్రాజెక్ట్ ఇండియన్ 2 ను తాజాగా ప్రారంభించారు, అతను ధీరన్ అధిగారం ఒండ్రు (తెలుగులో ఖాఖి)తో చక్కని పేరు తెచ్చుకున్న దర్శకుడు హెచ్ వినోద్‌తో ఒక చిత్రానికి సంతకం చేశారు. ఇక ఈరోజే కమల్ మరో ఆసక్తికరమైన సినిమాని ప్రకటించారు.
35 ఏళ్ల క్రితం వచ్చిన నాయగన్ (నాయకుడు) తర్వాత కమల్ తో మళ్లీ మణిరత్నం ఓ సినిమా చేస్తున్నట్టు తాజాగా ఖరారు అయింది. మణిరత్నం PS1 రూపంలో ఇటీవలే భారీ పేరు ప్రతిష్టలతో కూడిన విజయాన్ని అందుకున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్‌లో సంచలనాత్మక ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రజినీకాంత్ తన సూపర్ స్టార్‌డమ్‌ను ముఖ్యంగా ఈ తరం ప్రేక్షకులకి చూపించి చాలా కాలం అయ్యింది. రజినీకాంత్ కెరీర్‌లో కూడా మళ్ళీ ఆబాలగోపాలాన్ని అబ్బురపరిచే.. ఆశ్చర్యకరమైన సినిమాలు మళ్ళీ వస్తాయని ఆశిద్దాం. తద్వారా మళ్ళీ దర్శకుల వరుస ఆయన ఇంటి వద్ద క్యూ కడుతుంది.