తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కు చాలా కాలంగా సరైన హిట్ పడలేదు. తమిళంలో మంచి ఫామ్లో ఉన్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కమల్. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మొదటి ఆట నుంచి మంచి క్రేజ్ సంపాదించడంతో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.కమల్ హాసన్ తో పాటు ముఖ్య పాత్రలో ఫాహాద్ ఫాజిల్, విలన్ గా నటించిన విజయ్ సేతుపతి వల్ల ఈ చిత్రానికి తెలుగులో కూడా క్రేజ్ వచ్చింది.
ఈ సినిమాను స్వయంగా కమల్ హాసన్ నిర్మించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇక ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 110 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.తెలుగులో ఇప్పటికే ఈ చిత్రం 14 కోట్ల వరకు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళనాడు లో బాహుబలి2 ను దాటి ఇండస్ట్రీ హిట్ గా నిలవడానికి ఎంతో దూరం లేదు.ఈ వారాంతం లోపే విక్రమ్ ఆ ఘనతను సాధించచ్చు.
మామూలుగానే తమిళ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువ, కేవలం యూఎస్ కాకుండా ఆస్ట్రేలియా, యూకే, ముఖ్యంగా మలేసియా, సింగపూర్ లలో తమిళ సినిమాలకు కలెక్షన్లు బాగా వస్తాయి. తాజాగా విక్రమ్ ఓవర్సీస్ మార్కెట్ లో మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా లో 1 మిలియన్ మార్కును దాటింది, శంకర్ – రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 చిత్రం తరువాత ఆ ఘనతని సాధించిన సినిమాగా విక్రమ్ నిలిచింది