Homeసినిమా వార్తలుఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌లను అందించిన ఇద్దరు లెజెండ్స్

ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌లను అందించిన ఇద్దరు లెజెండ్స్

- Advertisement -

కమల్ హసన్ మరియు మణిరత్నం ఇద్దరూ తమ ప్రైమ్ టైమ్‌లో తమిళ పరిశ్రమలో నంబర్ 1 హీరో మరియు దర్శకులుగా నిలిచారు. కానీ కొంత కాలం తర్వాత వారు తమ క్రేజ్ తో పాటు బ్రాండ్‌ వాల్యూను కూడా కోల్పోయారు. వారు తెరకెక్కించిన కొన్ని సినిమాలకు కనీస స్థాయిలో కూడా వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. వారి పరిస్థితి చూసిన వారంతా ఇక కమల్ హాసన్, మణిరత్నం ల టైమ్ అయిపోయింది అని తీర్మానించేసుకున్నారు.

అందరూ ఇలా తమను ఔట్‌డేటెడ్‌గా ముద్రవేసిన సమయంలో.. ఈ ఇద్దరు లెజెండ్‌లు ఎవరూ ఊహించని విధంగా పుంజుకున్నారు. 2022 సంవత్సరం వారికి గేమ్ ఛేంజర్‌గా మారింది, విక్రమ్ సినిమాతో కమల్ హాసన్‌ ఇండస్ట్రీ హిట్‌ సాధించారు. మరియు అతని తదుపరి చిత్రం శంకర్‌తో ఇండియన్-2 చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక కమల్ హాసన్ తర్వాత, సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కూడా పొన్నియన్ సెల్వన్-1తో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించారు, ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం తమిళనాడులో విక్రమ్ కలెక్షన్లను దాటేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది.

READ  పోన్నియిన్ సెల్వన్ పై భారీ అంచనాలు పెట్టుకున్న తమిళ ఇండస్ట్రీ

మొదటి భాగం ఇంత పెద్ద విజయం సాధించడంతో, పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ కు ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది. అంతే కాకుండా, మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కుదుర్చుకున్నారు అని తెలుస్తోంది.

క్రికెట్‌లో ఫామ్ కోల్పోయిన స్టార్ ఆటగాళ్లను ఎప్పుడూ తక్కువ చేయకూడదు అని అంటుంటారు. మణిరత్నం, కమల్‌ హాసన్‌ల విషయంలో ఇది నిజమైంది. కొన్ని నెలల క్రితం వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌లు సాధించగలరని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఇండస్ట్రీ హిట్‌లు సాధించి అంతటితో ఆగకుండా రాబోయే క్రేజీ ప్రాజెక్ట్‌లతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ముప్పై మూడేళ్ల క్రితమే కమల్‌హాసన్‌తో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా చేయాలని మణిరత్నం ప్లాన్‌ చేశారట. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని 1989లో రూపొందించాలని ప్లాన్ చేశారు.

ఈ విషయాన్ని కమల్ స్వయంగా ‘కల్కి’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రభు, సత్యరాజ్ ఇతర ప్రధాన పాత్రధారులుగా, సినిమాటోగ్రాఫర్ గా పీసీ శ్రీరామ్, సంగీత దర్శకుడుగా ఇళయరాజాను అనుకున్నారట.

READ  గాడ్ ఫాదర్ సినిమాని ఎవరికీ అమ్మలేదు.. మేమే సొంతంగా రిలీజ్ చేసుకున్నాం - నిర్మాత ఎన్వీ ప్రసాద్

అయితే ఎందువల్లనో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు, చివరికి మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించడానికి మూడు దశాబ్దాలు పట్టింది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories