కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న అమీగోస్ చిత్రం ఫిబ్రవరి 10న అంటే రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమా ట్రైలర్ బాగుండటంతో సినిమా పై అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అంతగా ఆశాజనకంగా లేవు.
ఇక అమీగోస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 15 కోట్లకు క్లోజ్ అయినట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబిసార విజయం అమిగోస్ బిజినెస్ కు అదనపు అడ్వాంటేజ్ గా మారింది. ఆంధ్రలో [6 ప్రాంతాలు కలుపుకుని] ఈ చిత్రం 6.5 కోట్లు, సీడెడ్ లో 2.5 కోట్ల వరకూ వ్యాపారం చేయగా, నైజాం ఏరియాలో ఈ సినిమా విలువ సుమారు 4 కోట్లు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల మొత్తం బిజినెస్ విలువ 13 కోట్లు కాగా, వరల్డ్ వైడ్ టోటల్ 15 కోట్ల వరకూ ఉంటుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ స్టేటస్ అందుకోవాలంటే వరల్డ్ వైడ్ గా 15 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడానికి ప్రేక్షకుల నుండి మంచి సమీక్షలు మరియు పాజిటివ్ టాక్ చాలా అవసరం. మరి ఆ టాక్ వస్తుందా రాదా అనేది ఇంకొన్ని గంటల్లోనే తేలిపోతుంది.
ఒకేలా ముగ్గురు వ్యక్తులు కనిపించడం అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శాండల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. కోలీవుడ్ సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చారు.