బింబిసార వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత, నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, కాగా ఇందులో డోపెల్‌గేంగర్స్ గా త్రిపాత్రాభినయం చేశారు. ఈ సినిమా బాగా ప్రమోట్ చేయబడింది, కానీ దురదృష్టవశాత్తు, తుది ఫలితం మాత్రం నిరాశపరిచింది. ఆసక్తికరమైన కథనం లేకపోవడమే సినిమా పేలవంగా ఉండటానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు.
ఈ ప్రాజెక్టుకు నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి, ఆంగ్ల ఉపశీర్షికలతో పాటు తెలుగు ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ అమిగోస్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు.
అమిగోస్ సినిమా మొదటి రోజు యావరేజ్ రిపోర్ట్స్ అందుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఘోరంగా విఫలమైంది. నందమూరి అభిమానులు మరియు ప్రేక్షకులు ఆసక్తికరమైన ట్రైలర్ ను చూసి ఈ సినిమా పెద్దగా స్కోర్ చేస్తుందని ఆశించారు, కానీ దర్శకుడు తన దృష్టిని స్క్రీన్ పై పర్ఫెక్ట్‌గా అనువదించలేకపోయారు.
ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. బ్రహ్మాజీ, సప్తగిరి, జయప్రకాష్, కళ్యాణి నటరాజన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. గిబ్రాన్ స్వరాలు సమకూర్చారు. అమిగోస్‌ని థియేటర్‌లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.