Homeసినిమా వార్తలుబింబిసార vs సీతారామం

బింబిసార vs సీతారామం

- Advertisement -

టాలీవుడ్ లో సాధారణంగా అయితే ఒకేసారి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడకుండా చూసుకుంటారు. హీరోలు, దర్శకులు తమ సినిమా మరో సినిమాతో పోటీ పడటానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే రెండు సినిమాలు పోటీ పడితే ఖచ్చితంగా ఎవరో ఒకరు నష్టపోతారు కాబట్టి చాలావరకు ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం ఆ పోటీ అనివార్యం అవుతుంది. ఇప్పడు ఇదే తరహా పోటీ రెండు సినిమాల మధ్య ఏర్పడింది.

ఆగస్టు 5న నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ విడుదల కానుంది. 5వ శతాబ్దంలోని మగధ రాజ్యానికి చెందిన త్రిగర్తలాధినేత బింబిసారుడి కథకు టైం ట్రావెల్ వంటి కాన్సెప్ట్ లను జోడించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఇదే సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతారామం’ కూడా విడుదల అవుతుంది. హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నందమూరి కల్యాణ్ రామ్ తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి భారీ బడ్జెట్ తో బింబిసార చిత్రాన్ని నిర్మించారు. త్రిగర్తలాధినేత బింబిసారుడికి నేటి కాలానికి వున్న సంబంధం ఏంటీ? .. అసలు బింబిసారుడు ఈ యుగానికి ఎలా వచ్చాడు అనే ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ సినిమాని మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ లతో పాటు పాటలు కూడా సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి.

READ  రామారావు ఆన్ డ్యూటీ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్

ఇక సీతారామం సినిమాని హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు ఫిక్షనల్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ లతో మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో సుమంత్, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్ నటించారు.

ఇప్పటికే విడుదలైన సీతారామం పాటలు మంచి ఆదరణ పొందటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సీతారామం, బింబిసార రెండు సినిమాలు విజయం సాధించడం ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకి ఎంతో అవసరం.

‘బింబిసార’ సీరియస్ గా సాగే ఒక కల్పిత చారిత్రాత్మక సినిమా అవగా.. ‘సీతారామం’ ఒక చక్కని దృశ్యకావ్యంగా తెరకెక్కుతున్న ప్రేమ కథ. రెండు సినిమాలూ విబిన్నమైన కథలతో తెరకెక్కాయి. ఈ రెండు సినిమాల మీదే ప్రస్తుతం అందరి దృష్టి నెలకొని వుంది. వచ్చే వారం థియేటర్లలో సందడి చేయనున్న ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయో …బాక్సాఫీస్ రేసులో ఏ సినిమా విజయం సాధిస్తుందో తెలియాలంటే ఆగస్టు 5 వరకు ఆగాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp

READ  పవన్ ను ఒప్పించడానికి హరీష్ శంకర్ మరో ప్రయత్నం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories