Homeసినిమా వార్తలుఎన్టీఆర్ 30 పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ 30 పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిన కళ్యాణ్ రామ్

- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ విజయం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ వస్తున్న సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్ లో 30వ సినిమాగా దర్శకుడు కొరటాల శివతో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ ఎంచుకున్నారు ఎన్టీఆర్. ఇక ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ఒక మాస్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రం వారు అనుకున్నంత తొందరగా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందారు. ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా తరువాత రాబోయే సినిమా కావడంతో ఈ చిత్రాన్ని అటు ఎన్టీఆర్ ఇటు దర్శకుడు కొరటాల శివ ఎంతో జాగ్రత్తగా మలిచే ఆలోచనలో ఉన్నారు. అందుకే పక్కాగా స్ర్కిప్ట్ పనులు అన్నీ సిద్ధం చేసుకున్న తరువాతే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లాలన్న ప్రయత్నంలో ఎన్టీఆర్ – కొరటాల శివ ఉంటే అది అర్ధం చేసుకోకుండా సినిమాకి సంబందించిన ఏ అప్డేట్ లు రాట్లేదు.. సినిమా ఉంటుందా లేదా అన్న అనుమానాలు పెట్టుకుంటున్నారు.

అయితే ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి కల్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఆయన హీరోగా నటించిన తాజా చిత్రమైన ‘బింబిసార’ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఆయన ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన విషయాన్ని ప్రస్తావించటం జరిగింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్ ఏ స్థాయి విజయాన్ని సాధించిందనేది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో ప్రేక్షకులకి భారీ స్థాయి అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గని సినిమా చేయాలి కాబట్టే అందుకు తగ్గట్టుగా ఆ సినిమా పనులు జరుగుతున్నాయి అని కల్యాణ్ రామ్ తెలిపారు.

READ  Laal Singh Chadda: తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన అప్ డేట్ రావడం లేదని చాలామంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్న విషయం గురించి కూడా కళ్యాణ్ రామ్ మాట్లాడారు. ఎంతైనా అభిమానులకి ఆ మాత్రం ఉత్సాహం మరియు అసక్తి ఉండటం సహజమే అని ఆయన అన్నారు. ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ కు మాత్రమే కాదు దర్శకుడు కొరటాల శివకు కూడా ఎంతో భాధ్యత ఉంటుందని.. అందువల్లే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నాం అని కల్యాణ్ రామ్ చెప్పారు.

ఈ మేరకు ఎన్టీఆర్ 30 సినిమా ఖచ్చితంగా ఉంటుందని, అభిమానులు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కళ్యాణ్ రామ్ చెబుతూ.. సినిమాకి సంబంధించిన అప్డేట్ లు రావాల్సిన సమయానికి వస్తాయని తెలిపారు.

Follow on Google News Follow on Whatsapp

READ  గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్: కొత్త లుక్ లో అదిరిపోయిన మెగాస్టార్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories