పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ మైథాజికల్ జానర్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి. ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ జూన్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చింది.
ఇక మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న కల్కి మూవీ ప్రస్తుతం అనేక ఏరియాల్లో బాగా కలెక్షన్ రాబడుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్, నైజాం, నార్త్ తో పాటు ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో కల్కి ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే మ్యాటర్ ఏమిటంటే, మొత్తంగా గడచిన ఫస్ట్ వీక్ లో కల్కి 2898 ఏడి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 210 కోట్ల గ్రాస్ ని రూ. 135.32 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టింది.
ఇక ఏపీ, టిజి లో ఈ మూవీ రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా దానిని అందుకుని బ్రేకీవెన్ చేరుకోవాలి అంటే మరొక రూ. 32.68 కోట్లకు పైగా కల్కి రాబట్టాలి. అయితే ప్రస్తుతం ఇంకా కల్కి మంచి రెస్పాన్స్ తో కొనసాగుతుండడంతో రెండవ వారంలో కూడా బాగానే కలెక్షన్ రాబట్టే అవకాశం ఉందని, అలానే ఫైనల్ గా క్లోజింగ్ కి మంచి లాభాలు రాబట్టే అవకాశం కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.