పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ యాక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. కాగా దీనిని యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించారు.
వైజయంతి మూవీస్ సంస్థ పై సి. అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే మ్యాటర్ ఏమిటంటే నిన్నటితో తమ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్ల మార్క్ గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుందని కల్కి 2898 ఏడి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.
కాగా దీని పై కొందరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంకా ఈ మూవీ రూ. 900 కోట్ల లోపే రాబట్టగా మేకర్స్ మరొక రూ. 100 కోట్ల మేర యాడ్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారనేది వారి విమర్శ. కాగా ఈ విషయమై ప్రస్తుతం సోషల్ మీడియా తో పాటు పలు మీడియా మాధ్యమాల్లో హాట్ గా చర్చలు సాగుతున్నాయి.