పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినిదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ నటించారు. నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా శోభన, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్ ఇతర పాత్రలు చేసారు.
ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్ రాబడుతున్న కల్కి 2898 ఏడి మూవీ తాజాగా ఓవర్సీస్ లో కూడా అదరగొడుతోంది. విషయం ఏమిటంటే, తాజగా ఈ మూవీ అక్కడ 25 మిలియన్ డాలర్స్ మార్క్ తో పాటు నార్త్ అమెరికా లో 16 మిలియన్స్ కొల్లగొట్టింది. కాగా ఫుల్ రన్ లో 30 మిలియన్ డాలర్స్ రాబట్టే అవకాశం కూడా కనపడుతోంది. అయితే సౌత్ ఇండియాలో ఇప్పటివరకు కేవలం బాహుబలి 2 మాత్రమే ఫస్ట్ ఫేస్ లో 30 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరింది.
అలానే RRR, KGF 2 ఫస్ట్ ఫేస్ లో 27.5 మిలియన్స్ కొల్లగొట్టగా ఆపైన జపాన్ లో రిలీజ్ అనంతరం RRR మరింతగా రాబట్టింది. అయితే కల్కి 2898 ఏడి కూడా ఇతర దేశాల్లో రిలీజ్ కానుండగా, అనంతరం ఇది కూడా మరింతగా రాబట్టే అవకాశం ఉంది. కాగా దీనిని బట్టి ఫస్ట్ ఫేస్ రిలీజ్ లో RRR, KGF 2 సినిమాలను కల్కి 2898 ఏడి డామినేట్ చేసిందని చెప్పాలి. మరి రాబోయ్ రోజుల్లో కల్కి వరల్డ్ వైడ్ గా ఎంతమేర కొల్లగొడుతుందో చూడాలి.