పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కెలెక్షన్ తో కొనసాగుతోంది. ఈ భారీ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శోభన, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దీనిని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించారు.
ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత్య భారీ వ్యయంతో భారీ టెక్నీకల్ అంశాలతో అశ్వినీదత్ నిర్మించారు. కల్కి 2898 ఏడి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల సహా ఓవర్సీస్, నార్త్, వంటి ప్రాంతాల్లో కల్కి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుండడంతో పాటు నేటితో వరల్డ్ వైడ్ గా రూ. 800 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుందని నిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. పలువురు ప్రముఖ నటులు క్యామియో పాత్రల్లో నటించిన కల్కి సీక్వెల్ మూవీ ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకోగా మిగతా భాగాన్ని త్వరలో ప్రారంభిస్తామని తాజాగా దర్శకనిర్మాతలు తెలిపారు.