పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, శోభన వంటి వారు కీలక పాత్రల్లో కనిపించగా ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ జానర్ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు.
సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీకి జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ ఫోటోగ్రఫి అందించారు. విషయం ఏమిటంటే, రిలీజ్ అయి ఆరు రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా అనేక ప్రాంతాల్లో కల్కి మంచి కలెక్షన్ రాబడుతుండడం విశేషం. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ కి ఈ మూవీ నుండి మరింత మంచి రెస్పాన్స్ వస్తుండడడంతో మూవీ టీమ్ మరియు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కల్కి 2898 ఏడి మూవీ ఓవర్సీస్ లో 20 మిలియన్ మార్క్ ని దాటేసింది. అంతేకాక నాన్ రాజమౌళి మూవీగా 20 మిలియన్ సొంతం చేసుకున్న తొలి మూవీగా రికార్డు నమోదు చేసింది. ముఖ్యంగా నార్త్ అమెరికా నుండి ముప్పావుశాతం రెవెన్యూ లభిస్తోందని, చూస్తుంటే అతి త్వరలోనే కల్కి 25 మిలియన్ మార్క్ ని దాటేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి ఓవరాల్ గా కల్కి అక్కడ ఎంతమేర రాబడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.