పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ తో భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో ఆయన నటించిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జనార్ ఎంటర్టైనర్ మూవీ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ సంస్థ పై సి. అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ భారీ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు.
Kalki 2898 AD
ఇక ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో గ్రాండ్ లెవెల్లో విడుదలై మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. ఇప్పటికే గడచిన ఐదు రోజుల్లో మొత్తంగా రూ. 555 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కొల్లగొట్టిన కల్కి 2898 మూవీ అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా తన ప్రభంజనాన్ని చూపిస్తోంది.
ముఖ్యంగా నైజాం, నార్త్ అమెరికా సహా పలు ప్రాంతాల్లో కల్కి మరింతగా దూసుకెళ్తుండడంతో రాబోయే మరికొద్దిరోజుల్లోనే ఈ మూవీ రూ. 1000 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకునే అవకాశం కనపడుతోంది. కాగా గ్రాండియర్ విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే, టేకింగ్, యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్స్ వంటివి కల్కి 2898 మూవీకి ప్రధాన బలాలుగా చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక మూవీ ఇంకెంతమేర కలెక్షన్ కొల్లగొడుతుందో చూడాలి.