పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి జూన్ 27న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ జానర్ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా దిగ్గజ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో కనిపించారు. యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ భారీ లెవెల్లో నిర్మించింది.
విషయం ఏమిటంటే ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. మొత్తంగా గడచిన ఆరు రోజుల్లో ఈ మూవీ రూ. 650 కోట్ల మార్క్ ని దాటేసింది. ఇక ముఖ్యంగా నైజాం, ఓవర్సీస్, ఆంధ్ర లోని పలు ప్రాంతాలతో పాటు నార్త్ లో కూడా కల్కి బాగానే రాబడుతుండడం విశేషం.
దర్శకుడు నాగ అశ్విన్ అద్భుత టేకింగ్ తో పాటు పాత్రధారుల అత్యద్భుత పెర్ఫార్మన్స్, గ్రాండియర్ విజువల్స్ వెరసి కల్కి మూవీకి ఇంత భారీ సక్సెస్ అందించాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం కల్కి కి మరోప్రక్కన వేరొక సినిమా ఏది కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ఈ కలెక్షన్ ట్రెండ్ మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం కనపడుతోందని అలానే ఓవరాల్ గా ఈ మూవీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు.