పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సీస్ ఫైర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా నాగ అశ్విన్ దర్శకత్వంలో ఆయన చేసిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. జూన్ 27న అత్యధిక థియేటర్స్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ కూడా పెద్ద విజయం అందుకుంది.
కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్రప్రసాద్, దిశా పటాని, శోభన తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇప్పటికే మొత్తం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న కల్కి 2898 ఏడి మూవీ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ లో రూ. 1025 కోట్లు కొల్లగొట్టి ప్రభాస్ ఖాతాలో మరొక వెయ్యి కోట్ల మూవీగా నిలిచింది. ఇక అందులో రూ. 500 కోట్లు జీఎస్టీ కలిపి (3డి చార్జెస్ కాకుండా) తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టింది.
ఇక అటు ఓవర్సీస్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, నార్త్ వంటి ప్రాంతాల్లో మిగతా కలెక్షన్ రాబట్టింది. మొత్తంగా అయితే తెలుగు నుండి ఆర్ఆర్ఆర్ తరువాత అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీగా కల్కి 2898 ఏడి నిలిచిందని చెప్పాలి. దీని అనంతరం ఇప్పటికే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అలానే హను రాఘవపూడితో ఒక మూవీ, మారుతీ తో ది రాజా సాబ్ మూవీస్ చేస్తున్నారు ప్రభాస్.