పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ మూవీని యువ దర్శకడు నాగ అశ్విన్ తెరకెక్కించగా వైజయంతి మూవీస్ సంస్థ పై అశ్వినీదత్ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.
ఇక వరల్డ్ వైడ్ రూ. 950 కోట్ల+ గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ మూవీలో దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శోభన, బ్రహ్మానందం,రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ ఇంకా బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క 23 రోజుల తెలుగు వర్షన్ కలెక్షన్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
నైజాం – రూ. 88 కోట్లు
సీడెడ్ – రూ. 21 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 21 కోట్లు
ఈస్ట్ – రూ. 12 కోట్లు
వెస్ట్ – రూ. 9.1 కోట్లు
గుంటూరు – రూ. 10.7 కోట్లు
కృష్ణా – రూ. 10.85 కోట్లు
నెల్లూరు – రూ. 5.7 కోట్లు
ఏపీ / టిజి – రూ. 178.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 28 కోట్లు
ఓవర్సీస్ – రూ. 76 కోట్లు
వరల్డ్ వైడ్ – రూ. 282.35 కోట్లు
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ తో కలిపి కల్కి 2898 ఏడి మూవీ రూ. 282.35 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది. మరి మొత్తంగా ఈ మూవీ ఎంతమేర కెలెక్ట్ చేస్తుందో చూడాలి.