మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్స్ లో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరిర్ పరంగా వరుస సినిమాలతో కొనసాగుతున్నారు. తాజాగా ఆయన చేసిన భారీ మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. నాగ అశ్విన్ తీసిన ఈ మూవీలో అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే కీలకపాత్రల్లో కనిపించగా సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
వైజయంతి మూవీ సంస్థ గ్రాండ్ గా రూపొందించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ కూడా అమెరికా రీజియన్ లో ఓపెనింగ్స్ పరంగా టాప్ స్థానంలో కొనసాగుతోంది. అంతకముందు ప్రభాస్ నటించిన సలార్ మూవీ అన్ని రీజియన్స్ లో బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ అమెరికాలో మాత్రం ఓపెనింగ్స్ పరంగా బీట్ చేయలేకపోయింది.
కల్కి మూవీ క్లోజింగ్ లో ఆల్మోస్ట్ అక్కడ బాహుబలి 2 దగ్గరికి చేరింది. అయితే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1 కల్కి ని అందుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయిన పుష్ప 2 కి బాగా హైప్ ఉన్నప్పటికీ కల్కి రేంజ్ ఓపెనింగ్ ని అందుకోటంలో విఫలమైనట్టు తెలుస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించారు. మొత్తంగా లాంగ్ రన్ లో అమెరికా రీజియన్ లో కల్కి ఓవరాల్ కలెక్షన్ ని పుష్ప 2 మూవీ మరి రాబోయే రోజుల్లో బీట్ చేస్తుందో చూడాలి.