పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 జూన్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని కీలక పాత్రలు పోషించగా నాగ అశ్విన్ తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ సంస్థ గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ కి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త వైరల్ అవుతోంది.
దాని ప్రకారం ఈ మూవీ రిలీజ్ అయిన 10 వారాల అనంతరం ఓటిటి ఆడియన్స్ ముందుకి రానుందని తెలుస్తోంది. అంటే ఆగష్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పక్కాగా కల్కి 2898 ఏడి మూవీ ఓటిటి లో అందుబాటులోకి వస్తుందన్నమాట. మరి థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.