పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా యువ దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన భారీ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ జనార్ మూవీ కల్కి 2898 ఏడి ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొనె ఇందులో హీరోయిన్ గా కనిపించారు.
ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పై సి. అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు చేసారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించి బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది.
ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియన్స్ ఎప్పటినుండో ఎదురు చూస్తుండగా నేడు దానికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. కాగా కల్కి 2898 ఏడి మూవీ ఆగష్టు 22న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుండగా హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. మరి థియేటర్స్ లో అదరగొట్టిన ఈ మూవీ ఎంతవరకు ఓటిటిలో ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.