యువ దర్శకుడు నాగ అశ్విన్ తొలిసారిగా 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ ద్వారా మెగా ఫోన్ పట్టారు. అప్పట్లో మంచి విజయం అందుకున్న ఈ మూవీ అనంతరం కీర్తి సురేష్ తో సావిత్రి గారి బయోపిక్ మహానటి మూవీ తీసి మరొక సూపర్ హిట్ అందుకున్నారు. ఇక తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ తో సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఎంటర్టైనర్ కల్కి 2898 ఏడి తీశారు.
అందరి నుండి మంచి ప్రసంశలతో పాటు భారీ కలెక్షన్ సాధించిన కల్కి మూవీ ఇంకా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. అలానే ఈ మూవీ నిన్నటితో రూ. 1000 కోట్ల మార్క్ చేరుకుందని మేకర్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. మ్యాటర్ ఏమిటంటే, ఎప్పుడూ ఎంతో సౌమ్యంగా ఉండే నాగ అశ్విన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ తో పెద్ద సంచలనం రేపారు. తమ యంగ్ టీమ్ అంతా ఎంతో కష్టపడి ఎటువంటి బ్లడ్ షెడ్, అసభ్యత, అశ్లీలత, రెచ్చగొట్టే అంశాలు లేకుండా తీసిన కల్కి 2898 ఏడి మూవీకి ఆడియన్స్ ఈ స్థాయిలో రెస్పాన్స్ అందించినందకు థాంక్స్ అనేది ఆయన పోస్ట్ యొక్క సారాంశం.
కానీ ఆ పోస్ట్ ని బట్టి చూస్తే అది పక్కాగా ఆనిమల్ మూవీని ఆ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేసినట్లు అర్థమవుతోందని, కొద్దిసేపటి నుండి పలువురు ప్రేక్షకాభిమానులు నాగ అశ్విన్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దానితో ఒక్కసారి ఆయన తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ని డిలీట్ చేసారు. మరి ఈ మ్యాటర్ ఇకపై ఎటువంటి చర్చకు దారి తీస్తుందో చూడాలి.