ఇటీవల సలార్ తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజాగా వైజయంతి మూవీస్ సంస్థ పై నాగ అశ్విన్ తెరకెక్కించిన భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడి ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మరొక సక్సెస్ అందుకున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలు చేసారు.
తాజాగా ఆడియన్స్ ముందుకి వచ్చిన కల్కి 2898 ఏడి మూవీ సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. ఇక అన్ని ఏరియాలతో పాటు ముఖ్యంగా ప్రస్తుతం నార్త్ అమెరికా, ఓవర్సీస్, నైజాం, నార్త్ లలో కల్కి బాగా కలెక్షన్ రాబడుతోంది. ఇక ఇప్పటికే గడచిన ఐదు రోజులకుగాను రూ. 555 కోట్ల మార్క్ ని దాటేసిన ఈ మూవీ త్వరలోనే రూ. 1000 కోట్ల మార్క్ ని చేరుకుంటుందనేది పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం.
వాస్తవానికి గత ఏడాది ప్రభాస్ నుండి రిలీజ్ అయిన ఆదిపురుష్, సలార్ రెండూ కూడా ఈ మార్క్ ని అందుకోలేకపోయాయి. ఇక జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ బ్లాక్ బస్టర్స్ బాహుబలి, బాహుబలి 2 మూవీస్ అనంతరం వరుసగా పలు పాన్ సినిమాలు చేస్తూ హీరోగా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. అయితే తెలుగు సినిమాల్లో బాహుబలి 2 వరల్డ్ వైడ్ రూ. 1900 కొల్లగొట్టగా ఆ తరువాత ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ రూ. 1250 కోట్లు రాబట్టింది. మరి దాని తరువాత రూ. 1000 కోట్ల మార్క్ ని కల్కి 2898 ఏడి దాటేస్తుందో లేదో చూడాలి.
కాగా తప్పకుండా బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తరువాత రూ. 1000 కోట్ల మార్క్ దాటిన మూవీస్ లిస్ట్ లో కల్కి కూడా పక్కాగా చేరడం ఖాయమని పలువురు ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతున్నారు. మరి కల్కి 2898 ఏడి మూవీ రూ. 1000 కోట్ల మార్క్ ని ఎప్పుడు చేరుకుంటుందో చూడాలి.