పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 జూన్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా నాగ అశ్విన్ తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన కల్కి కి సీక్వెల్ గా త్వరలో కల్కి 2 రూపొందనున్న విషయం తెలిసిందే.
తాజాగా సీక్వెల్ గురించి దర్శకుడు నాగ అశ్విన్ మాట్లాడుతూ, ఇప్పటికే దానికి సంబంధించి నెలరోజుల షూటింగ్ చేయగా అందులో ఇరవై శాతం బాగా వచ్చిందన్నారు. అయితే భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని, ముఖ్యంగా ఈ భాగంలో కమల్, అమితాబ్, ప్రభాస్ ల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు.
వీరి మధ్య శక్తివంతమైన ధనుస్సు కీలకం కానుందన్నారు. ఇక ఈ భాగంలో సుప్రీం యాస్కిన్ పాత్ర మొదటి భాగం కంటే మరింత ఎక్కువ ఉంటుందట. ఇక కల్కి కి ప్రస్తుతం ఆడియన్స్ నుండి వస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్నిస్తోందని, కొందరైతే మళ్ళి మళ్ళి చూస్తున్నారని, ముఖ్యంగా ప్రతి ఒక్క టెక్నీషియన్, పాత్రధారి పడ్డ కష్టానికి ఇంత గొప్ప ఫలితం లభిస్తుండడంతో పట్టరాని సంతోషం అని అన్నారు నాగ అశ్విన్.