పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ భారీ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీని నాగ అశ్విన్ తెరకెక్కించగా ఇతర ముఖ్య పాత్రల్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం వంటి వారు నటించారు. జూన్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన కల్కి మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది.
వైజయంతి మూవీస్ సంస్థ అత్యంత్య గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. విషయం ఏమిటంటే, నిన్నటితో మొత్తంగా 18 రోజులకు గాను కల్కి 2898 ఏడి మూవీ ఇండియాలో రూ. 670 కోట్లు, అలానే ఓవర్సీస్ లో రూ. 240 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. మొత్తంగా దీనిని బట్టి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 910 కోట్లని కలెక్ట్ చేసిందని చెప్పాలి.
ప్రస్తుతం రూ. 1000 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తున్న కల్కి 2898 ఏడి మూవీ 3డి ఛార్జెస్ తో కలిపి రూ. 950 కోట్లు రాబట్టింది. మొత్తంగా తమ టీమ్ ఎంతో కష్టపడ్డ ఈ మూవీకి ఆడియన్స్ ఇంత గొప్ప విజయం అందించినందుకు ప్రత్యేకంగా ఆడియన్స్ కి నటులు అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్ సహా అందరూ కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.