ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన రెండు తెలుగు సినిమాలు కిరణ్ సబ్బవరం నటించిన క అలానే దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బాగా పెర్ఫాన్ చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించిన లక్కీ భాస్కర్ మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కించగా శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కేఏ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించిన క మూవీని సుజీత్, సందీప్ ద్వయం తెరకెక్కించారు.
ముఖ్యంగా లక్కీ భాస్కర్ మరింతగా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు భారీ లాభాలు అందించింది. ఇటు క మూవీ కూడా మంచి ప్రాఫిట్స్ అయితే సంపాదించి పెట్టింది. మొత్తంగా ఈ రెండు మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి ఇటీవల ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చాయి. కాగా ఈటీవీ విన్ లో క ప్రసారం అవుతుండగా లక్కీ భాస్కర్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది.
విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు కూడా అటు థియేటర్స్ లో బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా పెర్ఫామ్ చేయటంతో పాటు ప్రస్తుతం ఓటిటి ఆడియన్స్ ని కూడా అలరిస్తున్నాయి. క మూవీ ఇప్పటికే 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ సొంతం చే