యువ నటుడు కిరణ్ అబ్బవరం ఇటీవల కెరీర్ పరంగా ఒక్కో సినిమాని ఎంతో జాగ్రత్తగా ఎంచుకుంటూ కొనసాగుతున్నారు. ఇక ఇటీవల ఆయన హీరోగా సుజిత్ & సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ క. ఈ మూవీ మంచి అంచనాలతో గత ఏడాది దీపావళికి ఆడియన్స్ ముందుకి వచ్చి విజయం అందుకుంది.
అయితే అదే 2024 దీపావళి సమయంలో విడుదలైన ఇతర సినిమాలైన అమరన్ మరియు లక్కీ భాస్కర్ కంటే ఇది అతి తక్కువగా పెర్ఫార్మ్ చేసింది. నయన్ సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్ స్లే, కోట జయరాం, అన్నపూర్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కిరణ్ ఆకట్టుకునే యాక్టింగ్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ అంశాలకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
అనంతరం ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అంతగా స్పందన అందుకోలేకపోయింది. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల ఈటివిలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయిన క మూవీ అర్బన్‌లో 2.15 టిఆర్పి మరియు అర్బన్+రూరల్‌లో 2.11 టిఆర్పి మాత్రమే సాధించింది. ఒకరకంగా ఇది దారుణమైన రేటింగ్స్ అని చెప్పవచ్చు. అయితే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ గా ప్రసారం అయిన అమరన్ – స్టార్ మాలో 9.19, లక్కీ భాస్కర్ – స్టార్ మాలో 8.48 అర్బన్ రేటింగ్స్ ని అందుకోగా క మూవీ – ETV విన్ లో మరి పూర్ గా కేవలం 2.15 మాత్రమే అందుకుంది. కాగా ప్రస్తుతం రొమాంటిక్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దిల్ రుబా చేస్తున్నారు కిరణ్. మరి దానితో ఆయన ఎంతమేర విజయం అందుకుంటారో చూడాలి.