Home సినిమా వార్తలు ఆస్కార్ అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక?

ఆస్కార్ అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక?

JR.NTR Thanks Ram Charan, RRR Team, And Audience For Huge Success At The Box Office

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సాధారణ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే నిజానికి ఇప్పుడు మన దేశానికే గర్వ కారణంగా నిలిచిన సినిమా అని చెప్పాలి. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతునే ఉన్నాయి. సాధారణ సినిమా ప్రేమికులు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన చిత్ర పరిశ్రమల నుండి జర్నలిస్టులు, ప్రముఖ దర్శకులు మరియు సాంకేతిక నిపుణులు కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాని గొప్పగా ప్రశంసించారు.

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో వరుసగా అనేక వారాల పాటు అగ్రస్థానంలో నిలిచింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంతో పాటు, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటనకు కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా థియేట్రికల్ రన్ సమయంలో, రామ్ చరణ్ మెజారిటీ ప్రశంసలతో దూరంగా వెళ్ళిపోయారు. సినిమా విడుదలైన తొలిరోజు నుంచీ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాలో తమ హీరోని పొగడటం పక్కన పెట్టారు. అనవసరంగా సినిమాని మరియు రాజమౌళిని దుయ్యబట్టారు.

అయితే, ఇప్పుడు సినిమాకు మరియు జూనియర్ ఎన్టీఆర్‌ నటనకు అందుకుంటున్న ప్రశంసలను చూసి వారు తమ వైఖరిని మార్చుకున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కు పరిస్థితి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా పలు ఫిల్మ్ పోర్టల్స్ తారక్‌కి ఆస్కార్ నామినేషన్ కోసం హామీ ఇస్తున్నాయి. ఫిల్మ్ మరియు పాప్ కల్చర్ వెబ్‌సైట్ వెరైటీ తారక్‌ని ఆస్కార్‌లకు ఉత్తమ నటుల నామినేషన్ కోసం ఎంపిక చేసుకున్న లిస్ట్ లో ఎన్టీఆర్ ను ఒకరిగా షార్ట్‌ లిస్ట్ చేయడంతో అభిమానుల సందడి ప్రారంభమైంది. ఈ లిస్టు బయటకి వచ్చిన తరువాత, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ను ఆ లిస్ట్ లో ఎంపిక చేసుకోవాలని ట్రెండ్లు మరియు డిమాండ్లు పెరిగాయి. అంతే కాకుండా అనేక అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు కూడా దీని పై వ్యాసాలు ప్రచురించారు.

రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ హడావిడి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అకాడమీ అవార్డ్స్‌లో ఆర్‌ ఆర్‌ ఆర్ సందడి చేసే అద్భుతమైన అవకాశం ఉందని ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా చెప్పడం జరిగింది

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version