టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకోగా త్వరలో మూడవ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది.
విషయం ఏమిటంటే, నేడు జూనియర్ ఎన్టీఆర్ కి ఒక ఘటనలో బాగా గాయాలయ్యాయని ఉదయం నుండి ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో హల్చల్ చేస్తుండడంతో తాజాగా దానిపై ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. నిజానికి రెండు రోజుల క్రితం జిమ్ చేస్తున్న సందర్భంలో ఎన్టీఆర్ ఎడమచేతి గాయమైందని, ఆయన అలానే దేవర పార్ట్ 1 మూవీ లాస్ట్ డే షూట్ లో పాల్గొన్నారని అన్నారు. అయితే ఆ గాయం పెద్దదేమీ కాదని, కొన్నాళ్ల పాటు ఆయన చికిత్స తోపాటు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని అన్నారు. దయచేసి ఎటువంటి తప్పుడు పుకార్లు నమ్మవద్దని వారు కోరారు.