Home సినిమా వార్తలు ​JrNtr Shocking Comments on his Dance తన డ్యాన్స్ పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్ 

​JrNtr Shocking Comments on his Dance తన డ్యాన్స్ పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్ 

jrntr

టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ గా నిర్మిస్తున్న దేవర మూవీ సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకి రానుండగా మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవర నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్, టీజర్ అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచాయి. 

ఇటీవల ముంబైలో గ్రాండ్ గా థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసి అక్కడ కూడా మూవీ ప్రమోట్ చేసిన మేకర్స్, మొన్న చెన్నైలో తమిళ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, దేవర పై అందరికీ మంచి నమ్మకం ఉందని, ముఖ్యంగా లాస్ట్ 40 నిముషాలు సీన్స్ అద్భుతంగా వచ్చాయన్నారు. 

ఇక డ్యాన్స్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ, తనకు డైలాగ్స్ యాక్టింగ్ అంటే ఇష్టం అని, అయితే డ్యాన్స్ చేయాలంటే ఒకింత ఇరిటేటింగ్ గా ఉంటుందని అన్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ డ్యాన్స్ తనకు ఎంతో ఇష్టం అని, అయన ఫ్యాన్స్ చూస్తే ఎంతో సహజంగా అనిపిస్తుందన్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version