టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అయిన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస మూవీస్ లైనప్స్ తో మంచి జోరు మీదున్నారు. ఇటీవల నాగ అశ్విన్ తీసిన కల్కి 2898 మూవీతో భారీ సక్సెస్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం మారుతీతో ది రాజా సాబ్ మూవీ చేస్తున్నారు. అలానే త్వరలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, హను రాఘవపూడితో ఒక మూవీ చేయనున్నారు.
వీటిలో హను రాఘవపూడి మూవీ లవ్ యాక్షన్ డ్రామా మూవీగా రూపొందనుండగా దీనిని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. దీనికి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. ఇక మరోవైపు ప్రస్తుతం కొరటాల శివతో దేవర పార్ట్ 1 మూవీతో పాటు హృతిక్ తో కలిసి వార్ 2 మూవీస్ చేస్తున్న ఎన్టీఆర్, తాజాగా ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) మూవీని కూడా లాంచ్ చేసారు.
త్వరలో ఈమూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనిని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించనున్నారు. విషయం ఏమిటంటే, అటు ప్రభాస్ ఫౌజీ, ఇటు ఎన్టీఆర్ డ్రాగన్ రెండు సినిమాలు కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లనుండగా వీటిని 2026లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ల డ్రాగన్ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. ఆ విధంగా ఈ సినిమాల విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకటే ప్రొడక్షన్ టీమ్ తో పాటు ఒకటే విధానాన్ని అనుసరిస్తున్నట్లైంది.