టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన పాన్ ఇండియన్ భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీ దేవర పార్ట్ 1 అందరి నుండి మంచి రెస్పాన్స్ ని కలెక్షన్ ని సొంతం చేసుకుంది. దాని అనంతరం ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. వై ఆర్ ఎఫ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న ఈ బాలీవుడ్ మూవీని యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.
అయితే దీని తరువాత అతి త్వరలో కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ మూవీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్. మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని నిర్మించనున్నారు. ఇక ఈ రెండు సినిమాల అనంతరం ఎన్టీఆర్ లిస్ట్ లో దేవర 2 కూడా ఉండగా తాజాగా ఆయన మరొక క్రేజీ ప్రాజక్ట్ కి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ వంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించి మంచి విజయం సొంతం చేసుకున్న యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఎన్టీఆర్ కోసం ఒక రాసుకుని తాజాగా ఆయనకు వినిపించారట. అయితే అది ఎంతో నచ్చిన ఎన్టీఆర్, దానియొక్క పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేయమన్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలో ఈ క్రేజీ భారీ ప్రాజక్ట్ గురించిన పూర్తి వివరాలు అఫీషయల్ గా వెల్లడి కానున్నాయి.