టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల కొరటాల శివ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1 అందర్నీ ఆకట్టుకుని భారీ విజయం అందుకుంది. దీని అనంతరం తాజాగా హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2. ఈ మూవీపై అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే తాజాగా తన తదుపరి సినిమాను కూడా రేపటి నుంచి ప్రారంభించనున్నారు ఎన్టీఆర్. కేజిఎఫ్ సిరిస్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కునున్న ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ మూవీని నిర్మించనుండగా ఇందులో మలయాళన నటుడు టోవినో థామస్ కీలకపాత్ర పోషించునున్నారు.
అలానే కన్నడ అందాల భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతాన్ని, భువన గౌడ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం రేపటి నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ పది రోజుల పాటు జరుగనుండగా త్వరలో రెండో షెడ్యూల్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నారట.
ఇక అక్కడి నుంచి వేగవంతంగా సినిమాని పూర్తి చేసి వీలైనంత త్వరగా దీన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు టీమ్. వాస్తవానికి ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి అది మరికొన్నాళ్లపాటు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనపడుతోంది. కాగా వచ్చే ఏడాది సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుందని అంటున్నాయి సినీ వర్గాలు.