Homeసినిమా వార్తలుDevara Second Song Released మెలోడియస్ గా 'దేవర' సెకండ్ సాంగ్

Devara Second Song Released మెలోడియస్ గా ‘దేవర’ సెకండ్ సాంగ్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు.

రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 27న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఇటీవల దేవర పార్ట్ 1 నుండి రిలీజ్ అయిన ఫియర్ సాంగ్ ఆకట్టుకోగా నేడు మూవీ నుండి చుట్టమల్లే అనే పల్లవితో సాగె మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియోని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.

రామ జోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్ ని శిల్పరావు అద్భుతంగా పాడగా ఎన్టీఆర్, జాన్వీల లుక్స్, విజువల్స్ కూడా అదిరిపోయాయి. మొత్తంగా ఈ లిరికల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ బాగా వ్యూస్ సొంతం చేసుకుంటోంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన దేవర పార్ట్ 1 మూవీ, రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

READ  Game Changer Latest Update పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో 'గేమ్ ఛేంజర్'

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories