టాలీవుడ్ స్టార్ యాక్టర్ నందమూరి తారక రామారావు ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుతం తొలిసారిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్.
ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అయితే దీని అనంతరం ఇప్పటికే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి కమిట్ అయ్యారు ఎన్టీఆర్. ఈ మూవీలో అందాల నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నాయి.
త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీ అనంతరం తమిళ యువ డైరెక్టర్ నెల్సన్ తో జతకట్టనున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే వీరిద్దరి మధ్య స్టోరీ సిట్టింగ్స్ జరగడంతో ప్రాజక్ట్ కొలిక్కి వచ్చిందని, త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ తో జైలర్ 2 మూవీ చేస్తున్నారు నెల్సన్. మరి అందరిలో మంచి క్రేజ్ కలిగిన ఎన్టీఆర్, నెల్సన్ ప్రాజక్ట్ ఏ విధమైన స్టోరీ లైన్ తో తెరకెక్కుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే