బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా వార్ 2. ఆరేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయం అందుకున్న వార్ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతుంది.
యష్ రాజ్ ఫిలిమ్స్ వారి వైఆర్ఎఫ్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని భాషలు ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో అందరిని ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచింది.
ఇక విషయం ఏమిటంటే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి డాన్స్ చేయనున్న ఒక అద్భుతమైన డాన్సింగ్ నెంబర్ ని నిన్నటి నుంచి షూటింగ్ ప్రారంభించింది టీం. వాస్తవానికి ఎప్పుడో చిత్రీకరించాల్సిన ఈ సాంగ్ ని ఇటీవల హృతిక్ రోషన్ కాలి గాయం వలన కొన్నాళ్లు వాయిదా వేశారు.
ఈ సాంగ్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరూ పోటీపడి అద్భుతంగా డాన్స్ చేస్తున్నారని ఓవరాల్ గా ఈ సాంగ్ రేపు థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ అందించడం ఖాయం అంటున్నారు. ఆగస్టు 14న వార్ 2 మూవీ గ్రాండ్ లెవెల్లో పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది.